కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును కలిసి తన కొడుకు రాజారెడ్డి పెళ్లికి ఆహ్వానించారు. తనయుడి పెళ్లి నేపథ్యంలో షర్మిల కొన్ని రోజులుగా ఆయా పార్టీలకు చెందిన ప్రముఖులను కలుస్తూ వివాహ ఆహ్వాన పత్రికను అందిస్తున్నారు.

ఈ క్రమంలో హరీశ్ రావు నివాసానికి వెళ్లి పత్రికను అందించారు. తన తనయుడు రాజారెడ్డి పెళ్లికి రావాలని కోరారు. హరీశ్ రావుకు పత్రికను అందిస్తోన్న ఫొటోను షర్మిల తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నా కొడుకు పెళ్లికి ఆహ్వానించానని పేర్కొన్నారు.