విజయశాంతి భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. మరో పదిహేను రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో బీజేపీకి ఆమె భారీ షాకిచ్చారు. గత కొన్నిరోజులుగా ఆమె పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆమె పార్టీని వీడుతారనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. ఈ రోజు ఆమె బీజేపీకి రాజీనామా చేసి, ఆ లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. రేపో ఎల్లుండో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు.

విజయశాంతి త్వరలో తమ పార్టీలో చేరుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఇటీవల అన్నారు. బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఆమె పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఇటీవల పరేడ్ మైదానంలో జరిగిన… నరేంద్ర మోదీ పాల్గొన్న మాదిగల విశ్వరూప సభకు ఆమె హాజరు కాలేదు. నిన్న ఫేస్ బుక్, ఎక్స్ ప్రొఫైల్ పిక్ మార్చారు.