అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ సర్కార్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఏ ఒక్క ఎన్నికల హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలను కూడా నిర్వహించలేదని దుయ్యబట్టారు. మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. వివిధ పథకాల కింద తెలంగాణకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రూ. 27 లక్షల కోట్లను ఇచ్చిందని తెలిపారు. పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ఇచ్చిన హామీని కేసీఆర్ తప్పారని విమర్శించారు.