బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రశంసలు కురిపించారు. పార్లమెంటులో మహిళా బిల్లు కోసం కవిత చేస్తున్న పోరాటం ప్రశంసనీయమని ఆయన కితాబునిచ్చారు. కవిత పోరాటం వల్లే కేంద్రంలో కదలిక వచ్చిందని అన్నారు. కవిత కారణంగా ఇతర పార్టీలు కూడా మహిళా బిల్లు గురించి ఆలోచిస్తున్నాయని చెప్పారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లు పెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని అన్నారు. మహిళా బిల్లుకు తాము కూడా మద్దతు ఇస్తామని తెలిపారు.