హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు ఈ నెల 20 తర్వాత విడుదల కానున్నాయి. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కాగా.. నమోదైన మార్కుల పరిశీలన జరుగుతోంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరిగాయి. పరీక్షలు జరుగుతుండగానే మార్చి 10 నుంచి మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 4 విడతల్లో మూల్యాంకన ప్రక్రియను నిర్వహించి ఈ నెల 10న పూర్తి చేశారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకేసారి ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో ఈసీ నుంచి అనుమతి తీసుకోనున్నట్లు సమాచారం…..