PJNEWSPOWER OF JOURNALISM
క్రైమ్

మెట్రోలో సైబరాబాద్ సీపీ ప్రయాణం.. ట్రాఫిక్ తగ్గించేందుకు ప్రజలకు పిలుపు!

మెట్రోలో సైబరాబాద్ సీపీ ప్రయాణం.. ట్రాఫిక్ తగ్గించేందుకు ప్రజలకు పిలుపు!
మెట్రోలో సైబరాబాద్ సీపీ ప్రయాణం.. ట్రాఫిక్ తగ్గించేందుకు ప్రజలకు పిలుపు!
షేర్ చేయండి: WhatsApp X Facebook Telegram
PJNews | సైబరాబాద్: నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంతో పాటు వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజలు వ్యక్తిగత వాహనాల వినియోగాన్న…

PJNews | సైబరాబాద్: నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంతో పాటు వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజలు వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, ప్రజా రవాణా వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఐపీఎస్ పిలుపునిచ్చారు.

ప్రజలకు స్వయంగా ఆదర్శంగా నిలుస్తూ బుధవారం రసూల్‌పురా మెట్రో స్టేషన్ నుంచి రాయదుర్గం మెట్రో స్టేషన్ వరకు ఆయన మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ-1 జి. హనుమంతరావు, ట్రాఫిక్ అడ్మిన్ అదనపు డీసీపీ జి. నరేందర్‌తో పాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సైబరాబాద్ పరిధిలోని ఐటీ కారిడార్‌తో పాటు ప్రధాన రహదారులపై ఒక్కొక్కరు ఒక్కో కారులో లేదా ద్విచక్ర వాహనంపై ప్రయాణించడం వల్ల ట్రాఫిక్ ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోందన్నారు. సాధ్యమైనంత వరకు మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులను వినియోగించాలని సూచించారు.

PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

బ్రేకింగ్ న్యూస్, ముఖ్యమైన వార్తలను నేరుగా పొందండి.

ఇప్పుడే చేరండి
మెట్రోలో సైబరాబాద్ సీపీ ప్రయాణం.. ట్రాఫిక్ తగ్గించేందుకు ప్రజలకు పిలుపు!

ప్రజా రవాణా వినియోగం పెరగడం వల్ల రహదారులపై వాహనాల సంఖ్య తగ్గడంతో పాటు కాలుష్య నియంత్రణకు దోహదపడుతుందన్నారు. ప్రయాణ సమయం, ఇంధనం ఆదా కావడంతో పాటు సురక్షితమైన ప్రయాణానికి అవకాశం ఉంటుందని వివరించారు.

మెట్రో ప్రయాణంలో సహ ప్రయాణికులతో సీపీ నేరుగా ముచ్చటించారు. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, నగరవాసులు ప్రజా రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు పోలీసుల చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని ఆయన సందేశమిచ్చారు. వ్యక్తిగత వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించి ప్రజా రవాణాను వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని కోరారు.

మరిన్ని వార్తల కోసం PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ మీ వాట్సాప్‌లో పొందండి.

WhatsApp ఛానల్‌లో చేరండి