PJNEWSPOWER OF JOURNALISM
క్రైమ్

బాచుపల్లిలో ఎస్టీపీ సంప్‌లో ముగ్గురు కార్మికుల దుర్మరణం

బాచుపల్లిలో ఎస్టీపీ సంప్‌లో ముగ్గురు కార్మికుల దుర్మరణం
బాచుపల్లిలో ఎస్టీపీ సంప్‌లో ముగ్గురు కార్మికుల దుర్మరణం
షేర్ చేయండి: WhatsApp X Facebook Telegram
PJNews | బాచుపల్లి: పొట్టకూటి కోసం సొంత ఊరును వదిలి హైదరాబాద్‌కు వచ్చిన ముగ్గురు యువకులు మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) సంప్‌లో ప్రాణాలు కోల్పోయారు. …

PJNews | బాచుపల్లి: పొట్టకూటి కోసం సొంత ఊరును వదిలి హైదరాబాద్‌కు వచ్చిన ముగ్గురు యువకులు మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) సంప్‌లో ప్రాణాలు కోల్పోయారు. బాచుపల్లి పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన కార్మికుల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.

పోలీసుల కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలానికి చెందిన షణ్ముఖరావు అలియాస్ సుమన్ (26), పవన్ (20), సురేశ్ గాజి (24) ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చారు. మూసాపేట్, మియాపూర్ ప్రాంతాల్లో నివాసముంటూ కూలి పనులు చేసుకుంటున్నారు.

బాచుపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్ ఎస్టీపీ సంప్‌ను శుభ్రం చేసేందుకు కాంట్రాక్టర్ వీరిని తీసుకొచ్చాడు. సుమారు 25 అడుగుల లోతు, 12 అడుగుల వెడల్పు ఉన్న సంప్‌లోని నీటిని పంపింగ్ ద్వారా బయటకు తొలగించారు. అడుగున నడుము లోతు వరకు పేరుకుపోయిన బురదను తొలగించే క్రమంలో ముందుగా సంప్‌లోకి దిగిన షణ్ముఖరావు అస్వస్థతకు గురయ్యాడు. అతడిని కాపాడేందుకు లోపలికి దిగిన పవన్, సురేశ్ కూడా ప్రాణాలు కోల్పోయారు.

PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

బ్రేకింగ్ న్యూస్, ముఖ్యమైన వార్తలను నేరుగా పొందండి.

ఇప్పుడే చేరండి

విషవాయువుల కారణంగా ఊపిరాడక ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యుత్ షాక్ తగిలే అవకాశం ఉందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

భద్రతా చర్యలేవీ?

కార్మికులను సంప్‌లోకి దించే సమయంలో కనీస రక్షణ చర్యలు తీసుకోలేదని, భద్రతా పరికరాలు అందించలేదని మృతుడు సురేశ్ బావమరిది బాలసాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరైన పర్యవేక్షణ కూడా లేదని ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

బంధువులు వచ్చేలోపే మృతదేహాలను తరలించారంటూ కుటుంబ సభ్యులు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ పి. డాలీ నాయుడు తెలిపారు.

ఎస్టీపీ నిర్వహణలో కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు అందిస్తున్నారా? ప్రమాదకర పనులు చేపట్టే సమయంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? సంబంధిత మున్సిపల్, కార్మిక శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారా? అన్న ప్రశ్నలకు ఈ ఘటన నేపథ్యంలో సమాధానాలు రావాల్సి ఉంది.

మరిన్ని వార్తల కోసం PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ మీ వాట్సాప్‌లో పొందండి.

WhatsApp ఛానల్‌లో చేరండి