కిషన్‌రెడ్డి పాదయాత్ర.. హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

PJNews | హైదరాబాద్: హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చేపడుతున్న మూడు రోజుల పాదయాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పేరుతో ఈ నెల 25 నుంచి 27 వరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పాదయాత్ర నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
తొలిరోజు అంబర్‌పేట ఎంసీహెచ్ మైదానం నుంచి ముషీరాబాద్‌లోని కశిష్ ఫంక్షన్ హాల్ వరకు పాదయాత్ర సాగనుంది. అంబర్‌పేట మహంకాళి ఆలయం, 6 నంబర్ జంక్షన్, తిలక్‌నగర్, ఫీవర్ ఆసుపత్రి, విద్యానగర్, ఉస్మానియా యూనివర్సిటీ, సీతాఫల్‌మండి, చిలకలగూడ, పద్మారావునగర్, గాంధీ ఆసుపత్రి మీదుగా ముషీరాబాద్‌కు చేరుకోనుంది.
పాదయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనే అవకాశం ఉండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. రామంతాపూర్, గోల్నాక, విద్యానగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వైపు వెళ్లేవారు ట్రాఫిక్ పరిస్థితులను గమనించి ప్రయాణాలు సాగించాలని కోరారు.
బ్రేకింగ్ న్యూస్, ముఖ్యమైన వార్తలను నేరుగా పొందండి.
యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది రాజకీయ కార్యక్రమం కాదని, ప్రజల్లో అవగాహన పెంచేందుకే చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టడంతో పాటు వ్యసనానికి గురైన వారికి కుటుంబ సభ్యులు అండగా నిలవాలని సూచించారు. సినీ నటులు, విద్యావేత్తలు, మేధావులు ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. ఇప్పటికే సినీ నటులు ప్రభాస్, నాగార్జున, వెంకటేశ్‌లను కలిసి కార్యక్రమానికి మద్దతు కోరారు.
ప్రభాస్ ఈ కార్యక్రమానికి తన మద్దతు ప్రకటించారు. మూడు రోజుల పాదయాత్ర ఈ నెల 27న జూబ్లీహిల్స్‌లో ముగియనుంది.
పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడం మంచిది. ట్రాఫిక్ సమాచారం, ప్రయాణ సహాయం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్ 9010203626ను సంప్రదించవచ్చు.
తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ మీ వాట్సాప్‌లో పొందండి.

ఇప్పుడే చేరండి










