PJNEWSPOWER OF JOURNALISM
క్రైమ్

డిజిటల్ అరెస్ట్ దందా.. తెలంగాణలో రూ.50 కోట్లు స్వాహా!

డిజిటల్ అరెస్ట్ దందా.. తెలంగాణలో రూ.50 కోట్లు స్వాహా!
డిజిటల్ అరెస్ట్ దందా.. తెలంగాణలో రూ.50 కోట్లు స్వాహా!
షేర్ చేయండి: WhatsApp X Facebook Telegram
PJNews | హైదరాబాద్: పోలీసులమంటూ ఫోన్ చేస్తున్నారు.. మీపై కేసు నమోదైందని భయపెడుతున్నారు.. అరెస్టు తప్పదంటూ బెదిరించి బ్యాంకు ఖాతాల్లోని డబ్బును కొల్లగొడుతు…

PJNews | హైదరాబాద్: పోలీసులమంటూ ఫోన్ చేస్తున్నారు.. మీపై కేసు నమోదైందని భయపెడుతున్నారు.. అరెస్టు తప్పదంటూ బెదిరించి బ్యాంకు ఖాతాల్లోని డబ్బును కొల్లగొడుతున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు తెలంగాణలో ఈ ఏడాది తొలి పది నెలల్లోనే ప్రజల నుంచి రూ.50 కోట్లు కాజేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

జనవరి నుంచి అక్టోబర్ వరకు డిజిటల్ అరెస్ట్ మోసాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 846 ఫిర్యాదులు అందగా, పోలీసులు 241 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. గతంతో పోలిస్తే ఫిర్యాదుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఆర్థిక నష్టం భారీగానే ఉంటోంది.

2024 జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 5,097 ఫిర్యాదులు నమోదయ్యాయి. బాధితులు మొత్తం రూ.320 కోట్లు నష్టపోయారు. వీటికి సంబంధించి 1,697 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు వెల్లడైంది.

PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

బ్రేకింగ్ న్యూస్, ముఖ్యమైన వార్తలను నేరుగా పొందండి.

ఇప్పుడే చేరండి

పోలీసులు, సీబీఐ, ఈడీ అధికారుల పేరుతో నేరగాళ్లు ప్రజలను సంప్రదిస్తున్నారు. నకిలీ గుర్తింపు కార్డులు, అరెస్టు వారెంట్లు చూపిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు. వీడియో కాల్స్ ద్వారా మానసిక ఒత్తిడికి గురిచేసి డబ్బులు బదిలీ చేయిస్తున్నారు.

అయితే డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో వీడియో కాల్‌లో వ్యక్తులను నిర్బంధించి డబ్బులు వసూలు చేసే అధికారం ఏ దర్యాప్తు సంస్థకూ లేదు.

అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఇతరులకు చెప్పకూడదు. అపరిచితులు పంపించే లింకులను తెరవకూడదు.

ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలి. లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే డబ్బు బదిలీని అడ్డుకునేందుకు అంత ఎక్కువ అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తల కోసం PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ మీ వాట్సాప్‌లో పొందండి.

WhatsApp ఛానల్‌లో చేరండి