PJNEWSPOWER OF JOURNALISM
నగర వార్తలు

దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ఆల్విన్ కాలనీ సర్కిల్–51 డిప్యూటీ కమిషనర్‌కు శాలువాతో సత్కరించిన రామచంద్రారెడ్డి

దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ఆల్విన్ కాలనీ సర్కిల్–51 డిప్యూటీ కమిషనర్‌కు శాలువాతో సత్కరించిన రామచంద్రారెడ్డి
దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ఆల్విన్ కాలనీ సర్కిల్–51 డిప్యూటీ కమిషనర్‌కు శాలువాతో సత్కరించిన రామచంద్రారెడ్డి
షేర్ చేయండి: WhatsApp X Facebook Telegram
- ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న డిప్యూటీ కమిషనర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు శేర్లింగంపల్లి, నవంబర్ 23: వివేకానందనగర్‌కు చెందిన సీనియర్ సిటిజన్, ఫా…
  • ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న డిప్యూటీ కమిషనర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు

శేర్లింగంపల్లి, నవంబర్ 23: వివేకానందనగర్‌కు చెందిన సీనియర్ సిటిజన్, ఫాప్స్కో (FAPSCO) కూకట్‌పల్లి చాప్టర్‌కు చెందిన రామచంద్రారెడ్డి సోమవారం ఆల్విన్ కాలనీ సర్కిల్–51 డిప్యూటీ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కారానికి చొరవ చూపినందుకు డిప్యూటీ కమిషనర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆల్విన్ కాలనీ సర్కిల్ కార్యాలయానికి వస్తున్న ప్రజా ఫిర్యాదులపై స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి డిప్యూటీ కమిషనర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు చొరవ చూపుతున్న అధికారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఇదే విధమైన చొరవ కొనసాగించాలని ఆకాంక్షిస్తూ డిప్యూటీ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

బ్రేకింగ్ న్యూస్, ముఖ్యమైన వార్తలను నేరుగా పొందండి.

ఇప్పుడే చేరండి
మరిన్ని వార్తల కోసం PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ మీ వాట్సాప్‌లో పొందండి.

WhatsApp ఛానల్‌లో చేరండి