ప్రముఖ కొరియో గ్రాఫర్ షేక్ జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు. బుధవారం మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. పవన్ ఆయనకు కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షేక్ జానీ మాస్టర్… జనసేనానికి ఖుర్ ఆన్‌ను బహూకరించారు.

నెల్లూరు జిల్లాకు చెందిన జానీ మాస్టర్ కొన్నిరోజులుగా అక్కడే ఉండి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అవసరమైన వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఇదే సమయంలో ఆయన నేడు జనసేనలో చేరారు.