దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఇండియా (SBI) తమ డెబిట్ కార్డ్‌ల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచేసింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం SBI డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ ఛార్జీలను రూ.75 పెంచింది. దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. ఇప్పటివరకు ఏడాదికి 125 రూపాయలు ఛార్జ్ చేస్తుండగా పెరిగిన ఛార్జీల ప్రకారం ఏడాదికి 200 – 250 వరకు ఛార్జ్ చేయబడుతుంది. ఈ పెరిగిన ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి.