ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం గేమ్ చంగెర్మా. ఇప్పుడు ఈ చిత్రం నుండి రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా జరగండి అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేశారు. అయితే ఈ పాట ఇంతకుముందే విడుదల అవ్వాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయినట్లు చిత్ర యూనిట్ చెప్పింది. అయితే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేశారు. తమన్ సంగీతం అందించిన ఈ పాట ఇప్పుడు కుర్రకారుని ఆకట్టుకుంటోంది . ముందుగా తెలుగు వర్షన్‌ను రిలీజ్ చేసి ఆ తరువాత తమిళ్, హిందీ వర్షెన్ సాంగ్స్ ను రిలీజ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రంలోని పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా మెహ్నిది, సునిధి చౌహాన్ ఆలపించారు . తమన్ క్యాచీ బీట్‌కు ప్రభుదేవా కొరియోగ్రఫీ అదిరిపోయిందనే చెప్పాలి . ముఖ్యంగా విజువల్స్, సెట్స్ అదిరిపోయాయి. జరగండి పాటకు ప్రభుదేవా అద్భుతమైన కోరియోగ్రఫీ చేశారు , రామచరణ్ , కియారా కలర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. పాటలో విజువల్స్, సెట్ వర్క్, డిజైన్ అదిరిపోయిందనే చెప్పాలి .ఇక జరగండి పాటతో మొదలైన రచ్చతో ఇకపై గేమ్ చేంజర్ ప్రమోషన్స్‌ కూడా స్పీడ్ పెంచేలా ఉన్నారు. ఇంకో నెలలోనే షూటింగ్‌ను పూర్తి చేసేలా ఉన్నట్టు సమాచారం . అయితే ఈ చిత్రాన్ని ఏడాదిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే ఈ మూవీ బడ్జెట్, బిజినెస్, డిజిటల్ రైట్స్ విషయంలో ఎన్నెన్నో రూమర్లు వినిపిస్తున్నాయి . ఈ మూవీ దిల్ రాజు, శంకర్ కెరీర్‌లోనే హయ్యస్ట్ రికార్డ్ బిజినెస్ చేసే చిత్రంగా రికార్డులకు ఎక్కేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి .