తెలంగాణాలో కాంగ్రెస్ అందిస్తున్న ఆరు పథకాలలో భాగంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయికే కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోంది.. మరి ఏపీ లో 500 రూపాయలు సిలిండర్ ఎలా వస్తుంది…? అసలు విషయానికి వస్తే ప్రస్తుతం 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర 860 రూపాయలు . గతంలో 960 రూపాయలు ఉన్న సిలిండర్ రేటు తాజాగా .100 రూపాయలు తగ్గింది. ఏపీ, తెలంగాణలో సిలిండర్ ధర తగ్గింపు నేపథ్యంలో సిలిండర్ ధర 860కే లభిస్తోంది. అందువల్ల సిలిండర్ ఇప్పుడు బుక్ చేసుకుంటే తగ్గింపు రేటు వర్తిస్తోంది. అదే ఉజ్వల స్కీమ్ కింద కనెక్షన్ పొంది ఉంటే మరింత తగ్గింపు ధరలో గ్యాస్ సిలిండర్ పొందవచ్చు . ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వీరికి సబ్సిడీ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇలా సబ్సిడీ, తాజా తగ్గింపు కలుపుకుంటే వీరికి భారీగా బెనిఫిట్ అవుతుంది . ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై ఏకంగా 300 రూపాయలు తగ్గింపు అవుతుంది అంటే ఈ స్కీమ్ కింద సిలిండర్ పొందిన వారు గ్యాస్ బుక్ చేసుకుంటే తిరిగి 300 రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్లలోకి వస్తుంది . ఈ క్రమంలో చూస్తే.. ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కేవలం 560రుపాయలకే లభిస్తుంది .ఇది చాలా సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వచ్చే ఏడాది మార్చి చివరి వరకు సబ్సిడీ అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ప్రకటించింది. అంటే ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారు ఏపీలో ఉన్నా కూడా వీరికి 560రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభిస్తుందన్నమాట . ఉజ్వల స్కీమ్ లో గ్యాస్ ఉన్నవారికి ఉన్నవారికి ప్రత్యేకంగా ఎలాంటి పథకం అవసరం లేదని చెప్పవచ్చు . అయితే ఏపీ లో ఉన్న ఇతరులకు మాత్రం ప్రస్తుతం 860రూపాయలకు గ్యాస్ సిలిండర్ లభిస్తుంది.