మంగళగిరి జయహో బీసీ సభలో చంద్రబాబుతో కలిసి బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుంతంగం. బీసీ డిక్లరేషన్ ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. బీసీలు అన్ని విధాలుగా ఎదగాలనేదే తమ అభిమతం అని స్పష్టం చేశారు. అందుకోసం జనసేన-టీడీపీ కూటమి కృషి చేస్తుందని, ప్రభుత్వంలోకి వచ్చాక డిక్లరేషన్ ను అమలు చేస్తామని చెప్పారు. “జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏలూరులో బీసీ గర్జన సభ ఏర్పాటు చేసి చాలా హామీలు ఇచ్చారు. బీసీలకు ఏడాదికి రూ.15 వేల కోట్లు కేటాయిస్తానని జగన్ చెప్పారు. ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు కేటాయిస్తానని చెప్పారు. వాస్తవానికి వారు కేటాయించింది… సున్నా.153 కులాలను గుర్తించాలని బీసీ సంఘాల వారు చెబుతుంటారు. దాన్నే కుదించి 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి, చివరికి 53 కార్పొరేషన్లకు తగ్గించారు. ఆ కార్పొరేషన్లకు కుర్చీలు కూడా లేని పరిస్థితి ఉంది. ఈ దిశగా బడ్జెట్ లో కేటాయింపులు కూడా… సున్నా. వైఎస్సార్ చేయూత కింద 45 ఏళ్లు నిండిన మహిళలకు రూ.75 వేలు అందిస్తామన్నారు. ఈ పథకం అందుకుంటున్న బీసీ మహిళా లబ్దిదారుల్లో చాలా వరకు కోత పడుతోంది.