మంగళగిరి జయహో బీసీ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఇవాళ జనసేన, టీడీపీ పార్టీలు సంయుక్తంగా విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ ను ఈ సభకు హాజరైన వారు ప్రతి ఇంటికీ వెళ్లి గర్వంగా వివరించాలని పిలుపునిచ్చారు. ఈ బీసీ డిక్లరేషన్ ఏమీ ఆషామాషీగా తీసుకురాలేదని అన్నారు. గత మూడేళ్లుగా 153 కులాలను 56 సాధికార కమిటీలుగా విభజించి, అన్ని ప్రాంతాల్లో 800 మీటింగులు పెట్టామని వెల్లడించారు. నాయకులతో, ప్రజాసంఘాలతో మాట్లాడామని, లోకేశ్ పాదయాత్రలో గమనించిన అంశాలను కూడా అధ్యయనం చేశామని చెప్పారు. “జనసేన, టీడీపీ నేతలు కూర్చుని, ఒక బ్రహ్మాండమైనటువంటి, చరిత్రను తిరగరాసే బీసీ డిక్లరేషన్ ను ఇవాళ మీ ముందుకు తీసుకువచ్చాం. మీ జీవితాల్లో ఒక వెలుగు వచ్చేట్టుగా ముందుకుపోతున్నాం. ఇవాళ పవన్ కల్యాణ్ కూడా మనతో కలిసి వచ్చారు.