Sangareddy collector press meet

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి…. రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి ధరణి పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. అధికారుల పని తీరుపై అసహనం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ మున్సిపల్ పంచాయతీ రాజ్ ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవిన్యూ నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు మునిసిపల్ అధికారుల తో సమావేశం నిర్వహించారు ఈ సంధర్బముగా జిల్లాలోని సంగారెడ్డి పటాన్చెరు జిన్నారం తదితర మండలాలలో చెరువు లు కుంటలు ప్రభుత్వ ఇతర ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లాలోని చెరువులు కుంటలు ఎఫ్ టి ఎల్ పరిధిని అధికారులు సర్వే చేసి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు పటాన్చెరు జిన్నారం సంగారెడ్డి తదితర మండలాలలోని పెద్ద చెరువుల రికార్డులను వెంటనే సమర్పించాలని రెవెన్యూ ఇరిగేషన్ శాఖల అధికారులను ఆదేశించారు అన్యాక్రాంతం అయిన ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ భూములు పరిరక్షించాలనిఅన్నారు మైనింగ్ అనుమతులకు రెవెన్యూ అధికారులు ఎన్వోసీ తప్పనిసరి అన్నారు అనుమతి పొందిన మేరకే మైనింగ్ జరిగేలా అధికారులు పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలన్నారు బొల్లారం ఎర్రగుంట చెరువులో ఏర్పాటుచేసిన వెంచర్ వివరాలు వెంటనే ఇవ్వాలని సంబంధిత శాఖల అధికారులు ఆదేశించారు ధరణి పెండింగ్ సమస్యలను రెవెన్యూ అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు గ్రామస్థాయిలో ప్రభుత్వ భూములు ఆక్రమణకాకుండా ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు చూడాలన్నారు పల్లె ప్రకృతి వానాలు ఇతర ప్రభుత్వ స్థలాలు గ్రామస్థాయిలో కాపాడాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనన్నారు ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైతే పంచాయతీ కార్యదర్శులు రెవెన్యూ అధికారుల సహాయంతో నోటీసులు అందజేసి ఆక్రమణలు తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు మునిసిపల్ అధికారులు నోటీసులు మాత్రమే ఇచ్చి కూర్చుంటారని చర్యలు చేపట్టారని అసహనం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి డి ఆర్ ఓ పద్మజారాణి డి పి ఓ సాయిబాబా నీటి పారుదల శాఖ ఎస్ ఈ మురళీధర్ ఆర్ డి ఓ వసంత కుమారి సంబంధిత మండలాల తహసీల్దారులు సిబ్బంది పాల్గొన్నారు