సినీ నటుడు, జనసేన నేత నాగబాబు చేసే ట్వీట్లు ఒక్కోసారి చాలా వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా ఆయన ఎక్స్ వేదికగా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘వయసు ఎక్కువ, పెద్దవాడు అని ప్రతి వెధవను గౌరవించక్కర్లేదు. ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్లు అవుతారు’ అంటూ కన్ఫ్యూషియస్ కోట్ ను షేర్ చేశారు. గమనిక అంటూ దీనికి వివరణ కూడా ఇచ్చారు. ఏం మాట్లాడినా మా గురించేనేమో అని ఆపాదించుకుంటున్నారని… ఇది ఎన్నికల సమయం కాబట్టి తన ఉద్దేశాలను చెపుతున్నానే కానీ… ఎవరినీ ఉద్దేశించి చెప్పింది కాదు అని తెలిపారు. తాను చెప్పింది జీవిత సత్యమని అన్నారు.