నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాజకీయ జీవితం మరో మలుపు తిరుగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున లోక్ సభ అభ్యర్థిగా గెలిచిన రఘురామ… కొన్నిరోజులకే వైసీపీ నాయకత్వానికి శత్రువులా మారిపోయారు. 

ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన రఘురామ… తాను ఎంతగానో అభిమానించే చంద్రబాబు సమక్షంలో నేడు టీడీపీలో చేరుతున్నారు. దీనిపై ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 

“మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు… ఈ రోజు సాయంత్రం పాలకొల్లులో జరగనున్న ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నాను. ప్రజలందరూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు తెలిపి ఘనవిజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను” అంటూ రఘురామ ట్వీట్ చేశారు.