జనసేనాని పవన్ ఇటీవల తీవ్ర జ్వరం కారణంగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని అర్ధంతరంగా ఆపుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆయన కోలుకున్న నేపథ్యంలో, మళ్లీ ప్రచార బరిలో అడుగుపెట్టనున్నారు. ఏప్రిల్ 7 నుంచి వారాహి విజయభేరి యాత్రను కొనసాగించనున్నారు. ఈ మేరకు పవన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 

ఈ నెల 7న అనకాపల్లిలో, ఈ నెల 8న ఎలమంచిలి నియోజకవర్గంలో నిర్వహించే సభలకు పవన్ హాజరవుతారు. ఈ నెల 9న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకల్లో పాల్గొంటారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇక నెల్లిమర్ల, విశాఖ సౌత్, పెందుర్తి నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే ఖరారు చేయనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి