ఒక హీరో తిరస్కరించిన కథలు ఇంకో హీరో ఓకే చేసి హిట్స్ కొట్టడం సర్వసాధారణం. అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ వద్దనుకున్న కథలు సూర్య చేసి హిట్ కొట్టడం విశేషం. ఈ సంక్రాంతికి గుంటూరుకారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మహేష్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ కొడతాడంటూ ప్రిన్స్ అభిమానులు నమ్మకంగా ఉన్నారు దాదాపు మూడు సంవత్సరాలు ఈ సినిమాకే కేటాయించాల్సి వస్తోంది. రెండు భాగాలుగా రానుందా? లేదంటే ఒక భాగంగా వస్తుందా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇకపోతే ఎంతోమంది దర్శకులు మహేష్ బాబును దృష్టిలో పెట్టుకునే కథలు తాయారు చేస్తారు. కానీ వాటికి మహేష్ కాదనడంతో వేరే హీరోలతో చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా కొన్ని తిరస్కరించిన కథలతో ఏకంగా తమిళ స్టార్ హీరో సూర్య మూడు సినిమాలు చేశారు. వాటిల్లో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అవగా ఒకటి మాత్రం నిరాశపరిచింది. ఆ వివరాల్లోకి వెళ్తే సూర్య చేసిన ఘటికుడు సినిమా కథని దర్శకుడు కేఎస్ రవికుమార్ ముందుగా మహేష్ బాబుకే చెప్పారట. ఆయన తిరస్కరించడంతో తమిళంలో సూర్యతో చేయగా అది డిజాస్టర్ గా నిలిచింది. ఇక విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా 24.. ఈ కథ కూడా ముందుగా మహేష్ బాబుకే వినిపించారట దర్శకుడు .. ప్రిన్స్ నో చెప్పటంతో సూర్య తో 24 మూవీ చేయగా తెలుగు, తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. ఇక మురుగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన సెవెన్త్ సెన్స్ సినిమా కూడా మహేష్ బాబు దగ్గరకే వచ్చింది. ఈ కథను అర్థం చేసుకోలేక మహేష్ నో అనటంతో సూర్య ఓకే చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.