టీడీపీకి రాజీనామా చేసి జగన్‌ను కలిసిన కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ మాటల్లో నానికి కూడా భాగం ఉందని తేలిపోయిందని, కేశినేని వైసీపీ కోవర్ట్ అని స్పష్టమైందంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి కోఆర్డినేటర్‌గా వేయించుకున్న రోజే ఆయన బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్న విషయం తనకు అర్థమైందని అన్నారు. విజయవాడ పశ్చిమలో టీడీపీని నాశనం చేసేందుకు, వెలంపల్లికి అనుకూలంగా పనిచెయ్యడానికే బ్లాక్‌మెయిల్ చేసి కోఆర్డినేటర్‌గా వెళ్లారని తనకు తెలిసినా, చంద్రబాబుపై గౌరవంతోనే తాను మౌనంగా ఉండిపోయానన్నారు. ఈ రోజు ప్రజలకు, తెలుగుదేశం సైనికులకు ఆయన కుట్ర తెలిసిందని, కోవర్ట్ అని స్పష్టమైందని వెంకన్న విమర్శించారు.