ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తండ్రిని కూడా అడ్డు తొలగించుకొని.. సీఎం కుర్చీలో కూర్చోవాలి అనుకునేటోళ్లు కూడా ఉంటారు’ అంటూ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీపైనా, ఆ పార్టీ ఎమ్మెల్యేలపైనా సీఎం విమర్శలు గుప్పించారు. సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడి (అధికారం) నుంచి అక్కడకు (ప్రతిపక్షంలోకి) వెళ్లినప్పుడు వాళ్లకు (బీఆర్ఎస్) బాధ ఉండవచ్చునని.. అలా వెళ్లినప్పుడు బాధ సహజమేనని రేవంత్ రెడ్డి అన్నారు.

కొంతమందికి దుఃఖం కూడా ఉంటుంది…. కొంతమందికి జీవితంలో నెరవేరని కోరికలు ఉంటాయి… తండ్రిని కూడా అడ్డు తొలగించుకొని కుర్చీలో కూర్చోవాలనుకునేవాళ్లు కూడా ఉంటారు.. అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో ఔరంగజేబు వంటి స్టోరీలు మనం చూసినవే అన్నారు.