మలయాళంలో ఈ మధ్య కాలంలో సంచలనాన్ని నమోదు చేసిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ ‘ప్రేమలు’. నస్లేన్ .. మామితా బైజు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, గిరీశ్ దర్శకత్వం వహించాడు. కేవలం 3 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా అక్కడ 135 కోట్లను కొల్లగొట్టింది. అక్కడ ఫిబ్రవరి 9వ తేదీన విడుదలైన ఈ సినిమా, మార్చి 8వ తేదీన తెలుగు ఆడియన్స్ ను పలకరించింది. 

కథ ప్రకారం కేరళ ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చిన హీరో, ఇక్కడి అమ్మాయితో లవ్ లో పడతాడు. అందువలన తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఫలితంగా లాభాల బాట పట్టడానికి ఈ సినిమా ఎక్కువ సమయం తీసుకోలేదు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది.