రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు ఆయన భార్య నారా భువనేశ్వరి పెట్టుకున్న దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు.  ఇప్పటివరకు కుటుంబ సభ్యులు రెండుసార్లు కలిశారు. మొదటి సారిగా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి కలవగా, రెండోసారి.. నిన్న పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేశ్  చంద్రబాబును జైలులో  కలిసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ తర్వాత భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు. ఆయన ఆహారం విషయాన్ని రాజమండ్రిలోనే ఉంటూ భువనేశ్వరి చూసుకుంటున్నారు. మరోవైపు, వారానికి మూడుసార్లు ములాఖత్ కు అవకాశం ఉన్నా.. భువనేశ్వరికి ములాఖత్ నిరాకరించడంపై  టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.