ఈ నెల 17న చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి భారీ ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరవుతుండడంతో అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఉమ్మడి సభకు ‘ప్రజాగళం’ అనే పేరు ఖరారు చేశారు. ఈ  మేరకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. 

ప్రధాని మోదీ పాల్గొంటున్న సభను మూడు పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ‘ప్రజాగళం’ సభలో ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేయి చేయి కలిపి కూటమి శక్తిని చాటే ప్రయత్నం చేయనున్నారు.