అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో ఈనెల 26న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించడం వివాదాస్పదం అవుతోంది. సీఎం హెలికాప్టర్ దిగేందుకు ఓల్డ్ పోలీస్ క్వార్టర్స్ వద్ద ఖాళీ స్థలంలో కొబ్బరి చెట్లను నరికి హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. దీనిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ స్పందించారు. వైసీపీ పాలనలో చెట్లు కూడా విలపిస్తున్నాయని సెటైర్ వేశారు. కొట్టేసిన చెట్ల దృశ్యాలతో ఆయన ట్వీట్లు చేశారు. 

‘కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారు. తమిళనాట చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకొనే వాళ్లు ఈ విషయం కూడా తెలుసుకోవాలి. వృక్షో రక్షతి రక్షితః అని ట్వీట్ చేశారు’ ట్వీట్ చేశారు. ఇలా చెట్లను నరకవద్దని ఏపీ సీఎస్‌ అయినా అధికారులకు చెప్పాలని కోరారు.  ‘జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ‘పుష్ప విలాపం’ చదవనప్పుడు, జగదీష్ చంద్రబోస్ ప్రయోగాలు మీకు అర్థం కానప్పుడు, మొక్కలు,చెట్లకు గాయం చేస్తే ఎలా ఉంటుందో వీటిని చూస్తే తెలుస్తుంది. సీఎం పట్టించుకోకపోయినా కనీసం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా ఇలా  విచక్షణారహితంగా చెట్లను నరకవద్దని సంబంధిత అధికారులకు సూచించాలి’ అని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా  జంధ్యాల పాపయ్య శాస్త్రి ‘పుష్ప విలాపం’ నుంచి ఒక సారాంశం కూడా ప్రస్తావించారు. 

పవన్ పేర్కొన్న సారంశం ఇది..
ఓయీ మానవుడా
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి
అందమును హత్య చేసెడి హంతకుండా
మైలపడిపోయెనోయి నీ.. మనుజ జన్మ..
అని దూషించు పూలకన్నియల కోయలేక 
వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి గైకొని
నాపై నీ కరుణశ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు..
ప్రభూ… 

Pawan Kalyan on Twitter: “వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయి.. కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారు. తమిళనాట చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకొనే వాళ్లు ఈ విషయం కూడా తెలుసుకోవాలి.… https://t.co/tLHGWn3FU2” / Twitter