ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతుతో గెలిచి… ఇప్పుడు ఎర్రజెండా మోసేటోడే లేరని మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘ఏరు దాటాక తెప్ప తగలేయడం మామా, అల్లుళ్లకు అలవాటేనని మరోసారి రుజువు చేశారు హరీశ్ గారూ’ అని ట్వీట్ చేశారు. ఈ ఊసరవెల్లుల గురించి కమ్యూనిస్టు సోదరులు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే వారికి, సమాజానికి అంత మంచిదని చెప్పారు. కమ్యూనిస్టులకు కార్యకర్తలు కూడా లేరని… సీపీఐ, సీపీఎం ఉచ్చులో పడొద్దని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ హరీశ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ విమర్శలు గుప్పించారు.