నూతన ఆర్థిక సంవత్సరం(2024-25) మొదలైన నేపథ్యంలో కేంద్రం గతంలో ప్రకటించిన కొత్త పన్ను విధానాన్ని నేటి నుంచి అమల్లోకి తెచ్చింది. పన్ను చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు, పన్ను భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఈ విధానం ప్రారంభించింది. ప్రభుత్వం ఈ విధానాన్ని డీఫాల్ట్‌గా అమలు చేయనుండటంతో పాత విధానంలో పన్ను చెల్లించాలనుకున్న వారు ఈ విషయాన్ని ముందస్తుగా తమ దరఖాస్తుల్లో ప్రకటించాలి. లేని పక్షంలో కొత్త విధానంలో పన్ను మదింపు జరుగుతుంది. పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం మధ్య మీరు ఎంచుకోకపోతే, ఏప్రిల్ 1 నుండి మీరు డీఫాల్ట్‌గా కొత్త పన్ను విధానంలోకి మార్చబడతారు. కొత్త పన్ను విధానంలో, .7 లక్షల వరకు ఆదాయంపై మీరు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, పెట్టుబడి పెట్టి పన్ను ఆదా చేయాలను…