నరసాపురం ఎంపీ, ఉండి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటో పంచుకున్నారు. ఇవాళ (మే 19) భారత మాజీ రాష్ట్రపతి, తెలుగు రాజకీయ దిగ్గజం నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా రఘురామ ఆయనకు నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తాను యువకుడిగా ఉన్నప్పుడు నీలం సంజీవరెడ్డిని కలిసి తీయించుకున్న ఫొటోను కూడా పోస్టు చేశారు.ఈ ఫొటోలో ఎంతో కుర్రవాడిగా ఉన్న రఘురామను కూడా చూడొచ్చు. రఘురామకు పెళ్లయిన కొత్తలో ఈ ఫొటో తీయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఆసక్తికర ఫొటో పంచుకున్న రఘురామ… భారతదేశ మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు అర్పిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.