తనకు మల్కాజ్‌గిరి లేదా భువనగిరి టిక్కెట్ ఇచ్చిన పర్వాలేదని… ఆ సమయంలో అవసరమైతే అల్లు అర్జున్ తనకు మద్దతుగా ప్రచారం చేస్తారని స్టైలిష్ స్టార్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయనతో టీవీ9 ఛానల్ మీడియా ప్రతినిధి ముఖాముఖి నిర్వహించారు. అల్లు అర్జున్ మీకు మద్దతుగా ప్రచారం చేస్తారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.

దానికి చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ… ఈ రోజు ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, అదే సమయంలో అల్లు అర్జున్ సహా తన కుటుంబం తనకు మద్దతుగా ఉంటుందన్నారు. ప్రజలే కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారన్నారు. ఆ సమయంలో (టిక్కెట్ ఇచ్చాక) పరిస్థితిని బట్టి అల్లు అర్జున్ ప్రచారానికి వచ్చే అవకాశముంటుందన్నారు. అయినప్పటికీ ఈ రోజు ఎవరు వచ్చినా… ఎవరు రాకపోయినా ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు.