నారా చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా బుధవారం తిరుమల వెళుతున్నారు. సాయంత్రానికి లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ తిరుమల చేరుకుంటారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో ఉన్న నారా భువనేశ్వరి తిరుమల చేరుకునే సరికి రాత్రి అవుతుందని సమాచారం. గురువారం నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకుని, అర్చకుల ఆశీస్సులు అందుకోనున్నారు.

అనంతరం ఆలయంలో అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తారు. ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు నాడు చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని, అన్నదానం చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.