జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఎస్ఎస్సీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు, వారికి మండల నాయకులు గజమాలతో గణంగా ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గం నాయకులను వారికి గాలి అనిల్ కుమార్ ని పరిచయం చేశారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ.. కుటుంబ సభ్యునిలా కష్టసుఖాల్లో అందుబాటులో ఉంటానని , ప్రజలు తనకు అవకాశం ఇస్తే జహీరాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు కాంగ్రెస్ నిజస్వరూపం తెలిసిపోయింది. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని జనాలు నిర్ణయించుకున్నారు. ఈసారి మనం అందరం కష్టపడి పని చేస్తే జహీరాబాద్ నుంచి భారీ ఆధిక్యం ఇవ్వొచ్చు
ఈ కార్యక్రంలో మండల నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినుధులు తదితరులు పాల్గొన్నారు..