ఎన్నికల ప్రచార పర్వం ముగియడానికి సమయం సమీపిస్తోంది. అన్ని పార్టీల నేతలందరూ నిర్విరామంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రచార క్రమంలోనే విజయవాడలో కూటమి నేతలు ప్రజాగళం రోడ్ షో నిర్వహించారు . ఈ రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆయనతో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారు. త్రిమూర్తులు పాల్గొన్న విజయవాడ రోడ్ షో విజయవంతం అవటం పట్ల కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా కూటమి గెలుపు ఖాయమoటున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కాగా విజయవాడలో ప్రజాగళం రోడ్ షో విజయవంతం అయినందుకు తన సంతోషం వ్యక్తం చేస్తూ నిజంగా ఇది మరపురాని రోడ్ షో అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అయితే తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా రోడ్ షో సక్సెస్ పై సోషల్ మీడియాలో తమ స్పందన తెలిపారు . నరేంద్ర మోదీ ట్వీట్ ను చంద్రబాబు రీట్వీట్ చేస్తూ విజయవాడ రోడ్ షో ఫొటోలను మోదీ ఎక్స్ లో పంచుకోవడాన్ని ప్రస్తావించారు .. ఈ అద్భుతమైన గ్లింప్స్ ను మా ప్రజలతో పంచుకున్నందుకు, ఏపీకి భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మీరు, తాను , పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్న ఈ రోడ్ షో ఏపీ ప్రజలందరిలో విజయం పై నమ్మకాన్ని నింపిందన్నారు. ఈ రోడ్ షో ఏపీ ప్రజల్లో, మహిళలల్లో , యువతలో కొత్త ఆశాదీపం వెలిగించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా రోడ్ షోపై ట్వీట్ చేశారు. “ప్రధాని మోదీ ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం తన విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు . ఈ రోడ్ షో జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయని , మీరు సంకల్పించిన వికసిత భారత్ కార్యాచరణ కోసం మేం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామంటూ అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.