ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడని… పార్టీలోనే ఉంటూ పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆయన శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గంలో మాట్లాడుతూ… తాను అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవెళ్ల నియోజకవర్గంలో చాలాచోట్ల ప్రచారం చేశానన్నారు.

తాండూరు అసెంబ్లీ సీటు ఏకపక్షంగా గెలుస్తామని బలంగా అనుకున్నామన్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు… కొన్నిచోట్ల ఓడిపోయామన్నారు. పట్నం మహేందర్ రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రంజిత్ రెడ్డే మొదట ఫోన్ చేశారని… చేవెళ్ల లోక్ సభ అభ్యర్థిగా తనను ప్రకటిస్తే తప్పకుండా గెలుస్తామని చెప్పాడని తెలిపారు.