హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం సాయంత్రం ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇంకా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్ రావు కూడా విచ్చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు.