ఈ రోజు (సెప్టెంబర్ 2) కిచ్చా సుదీప్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో తన అభిమానులను కలవాల్సి ఉంది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా అభిమానులతో కలయిక రద్దయింది. ఈవెంట్ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో కిచ్చా సుదీప్ తన అభిమానులకు సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా క్షమాపణలు చెప్పారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను షేర్ చేశాడు. మీ అందర్నీ కలవలేకపోయినందుకు క్షమించండని, అభిమానులు దూసుకురావడంతో ఇంటి ముందు ఏర్పాటు చేసిన బారీకేడ్లు విరిగిపోయాయని, దీంతో పలువురికి ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు. అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారని, భద్రతా కారణాల వల్ల తాను అభిమానులను కలవలేకపోయానన్నారు. త్వరలోనే మీ అందర్నీ కలుస్తానని ఆ వీడియోలో పేర్కొన్నారు.