గతంలో తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ ను తక్కువగా అంచనా వేశామని, ఉద్యమకారుల మరణానికి తమదే బాధ్యత అని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించడం తెలిసిందే. తప్పు జరిగిపోయింది అంటూ ఆయన క్షమాపణలు తెలిపారు. అయితే, చంపినవాడే సంతాపం తెలిపినట్టుంది అంటూ చిదంబరం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. 

తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా చిదంబరం క్షమాపణ వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. గ్యారెంటీలు ప్రకటించడానికేమో గాంధీలు వస్తారా… క్షమాపణలు చెప్పడానికేమో బంట్రోతులను పంపిస్తారా…? 6 దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ కూడా చెప్పలేరా…? అంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు.