జగన్ అక్రమ కేసులతో చేస్తున్న క్షుద్ర రాజకీయానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ కూడా క్షోభిస్తుందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత నీచమైన రాజకీయాలు ఎవరూ చేయలేదని చెప్పారు. రోజుకో అరెస్టుతో జగన్ రెడ్డి చరిత్ర హీనుడిగా ముగిసిపోతాడని స్పష్టం చేశారు. ‘‘రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు… ప్రతి పక్షాలతో రాజకీయంగానే పోరాడారు తప్ప తప్పుడు కేసులతో వేధించలేదు. నేడు పులివెందుల ప్రజల్లో కూడా జగన్ రెడ్డిపై వ్యతిరేకత మొదలైంది. కడప జిల్లాలో టీడీపీ ఇంచార్జులు ప్రవీణ్, బీటెక్ రవి అరెస్టులు జగన్ పిరికితనానికి అద్దంపడుతున్నాయి’’ అంటూ విమర్శలు గుప్పించారు.