Home Andhra Pradesh వారాహి కోసం కాకినాడ జనసేన మీటింగ్

వారాహి కోసం కాకినాడ జనసేన మీటింగ్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోప్రారంభించిన వారాహి యాత్ర జూన్ 17,18వ తేదీలలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పర్యటన సందర్బంగా విజయవంతం చేయడానికి కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన శ్రేణులతో సన్నాహక సమావేశం జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ అధ్యక్షతన కాకినాడ కాస్మోపొలిటిన్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది.. సమావేశంలో నానాజీ మాట్లాడుతూ.. అన్ని గ్రామాల్లో,కాకినాడ రూరల్ డివిజన్ స్థాయిలో ప్రతీ ఒక్కరు వారాహి యాత్రలో భాగంగా ప్రజాసమస్యలు తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు మీ ముందుకు వస్తున్నారని ప్రతీ ఇంటికి వెళ్ళి నేరుగా తెలియచేయాలనీ అదేవిదంగా కరపత్రాల ద్వారా, ఫ్లెక్సీల ద్వారా, ఆటోల్లో ప్రచారం ద్వారా, పోస్టర్లద్వారా మరియు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని జనసేన శ్రేణులకి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల,సిటీ, గ్రామ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

Previous articleబంగారం కొనే ప్లానింగ్‌లో ఉన్నారా? అయితే మీకు శుభవార్త..
Next articlerashi khanna latest photos