నేడు (ఆగస్టు 7) ప్రపంచ చేనేత దినోత్సవం. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. సునిశితమైన హస్త కళలకు భారతదేశం పుట్టినిల్లు అని పేర్కొన్నారు. అటువంటి కళలలో చేనేత ముఖ్యమైనదని తెలిపారు. అగ్గిపెట్టెలో పట్టేంత చీరను మన నేత కళాకారులు రూపొందిస్తే, ఆ గొప్పదనం చూసి ప్రపంచం అబ్బురపడిందని పవన్ కల్యాణ్ వివరించారు. నేడు ప్రపంచ చేనేత దినోత్సవం జరుపుకుంటున్న ఈ శుభ సమయాన, ఈ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తన తరఫున, జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  “ఆధునిక కాలంలో చేనేత కళ కాస్తంత మసకబారింది. చేనేతకు పూర్వవైభవం తీసుకువరావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజలు సైతం తమ వంతు సహకారం అందించాలి. ప్రజలంతా తప్పనసరిగా వారంలో ఒక రోజైనా చేనేత దుస్తులను ధరించాలి. ఘన చారిత్రక నేపథ్యం ఉన్న చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నన్ను నేను అంకితం చేసుకోవడం అదృష్టంగా భావిస్తాను. ఈ కళనే నమ్ముకుని, ఈ కళను సజీవంగా నిలుపుతూ జీవిస్తున్న చేనేత కుటుంబాలకు ప్రభుత్వాలు ఎల్లవేళలా అండగా నిలబడాలని కోరుకుంటున్నాను” అంటూ పవన్ తన ప్రకటనలో తెఇపారు.

Previous articleతీవ్రంగా కలచివేసింది: గద్దర్ మృతిపై మావోయిస్ట్ పార్టీ లేఖ
Next articleరాహుల్ గాంధీతో పెళ్లికి సై అంటున్న బాలీవుడ్ భామ… కానీ!