ప్రజా యుద్ధ నౌక గద్దర్ మృతిపై మావోయిస్ట్ పార్టీ స్పందించింది. గద్దర్ మృతి తీవ్రంగా కలచివేసిందని లేఖ ద్వారా తెలిపింది. గద్దర్ నాలుగేళ్ల పాటు అజ్ఞాత జీవితాన్ని కొనసాగించారని ఆ లేఖలో పేర్కొంది. అయితే ఆయన అవసరాన్ని గుర్తించి తాము అజ్ఞాతం నుండి బయటకు పంపించినట్లు తెలిపింది. ఆ తర్వాత గద్దర్ చేత జనచైతన్య మండలిని ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చామని తెలిపింది. 2012 వరకు పీడీత ప్రజల పక్షాన నిలిచిన గద్దర్ ఆ తర్వాత పార్లమెంట్ మార్గాన్ని ఎంచుకున్నారని వెల్లడించింది. ఇతర పార్టీలతో కలిసినందుకు షోకాజ్ నోటీసు ఇచ్చామని గుర్తు చేసింది. అదే సంవత్సరం పార్టీకి రాజీనామా చేశారని, దానిని తాము ఆమోదించామని వెల్లడించింది.

Previous article గద్దర్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
Next article ప్రజలంతా తప్పనిసరిగా వారంలో ఒక రోజైనా చేనేత దుస్తులు ధరించాలి..