జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు పిఠాపురం నియోజకవర్గం నుంచి వారాహి విజయభేరి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పిఠాపురం చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ్నించి ముందుగా దొంతమూరు వెళ్లారు. దారి వెంట భారీగా భారీగా విచ్చేసిన ప్రజలు పవన్ కల్యాణ్ కు ఘన స్వాగతం పలికాయి. ఇక, పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ కు వర్మ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. అనంతరం పవన్ కల్యాణ్. వర్మతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో సుజయకృష్ణ రంగారావు కూడా పాల్గొన్నారు. జనసేన, టీడీపీ శ్రేణులతోనూ పవన్ కల్యాణ్ మాట్లాడారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ వారాహి వాహనంపై ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధం కాగా.. పోలీసులు అనుమతి నిరాకరించారు. వారాహికి అనుమతి లేదని స్పష్టం చేశారు. అయినా వెనుకడుగు వేయని పవన్ చేబ్రోలు సభలో డీసీఎం మీద నుంచే ప్రసంగించారు. పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలులో శనివారం రాత్రి జరిగిన సభలో జనసేన అధినేత, పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘సిద్ధం పేరిట కేవలం ప్రచార హోర్డింగులకే 600 కోట్లు ప్రజాధనం లూటీ చేసిన జగన్ పేదవాడు అని విమర్శించారు. అయిదేళ్లు అధికారం లేకున్నా ప్రజల తరఫున తాను పోరాడాను అన్నారు . వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ. పూర్తిగా పక్కన పడేయాల్సిన సమయం వచ్చిందని పవన్ తెలిపారు , వచ్చే ఎన్నికల్లో జగన్ ను నమ్మి మళ్లీ మోసపోవద్దని, ఈ ఎన్నికలు పేదవారికి, పెత్తందారులకు మధ్య యుద్ధం అని జగన్ పదేపదే మాట్లాడుతున్నాడన్నారు . ఆయన పార్టీ తరఫున ఎన్నికల్లో దిగుతున్న అభ్యర్థులు ఒక్కోక్కరికి కోట్ల మేర ఆస్తులున్నాయని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు.