జగన్ నా ఎస్సీలు అంటూనే రోజుకొక ఎస్సీని చంపేయిస్తున్నాడని టీడీపీ యువనేత నారా లోకేశ్ మండిపడ్డారు. ద‌ళిత ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గం, ద‌ళిత హోం మంత్రి ఇలాఖాలో ద‌ళిత యువ‌కుడు మ‌హేంద్ర పోలీసుల వేధింపులు తాళ‌లేక ఆత్మ‌హ‌త్య‌కి పాల్ప‌డ‌టం రాష్ట్రంలో ద‌ళితుల‌పై అధికార వైసీపీ సాగిస్తున్న ద‌మ‌న‌కాండ‌కి మ‌రో నిద‌ర్శ‌నమని చెప్పారు. బాధితుడి పిన్ని వైసీపీ జెడ్పీటీసీ విజ‌య‌ల‌క్ష్మి వైసీపీ పెద్ద‌ల్ని వేడుకున్నా క‌నిక‌రించ‌లేదని అన్నారు. మ‌హేంద్ర‌ని క‌స్ట‌డీలోకి తీసుకుని హింసించిన పోలీసుల‌ను విధుల నుంచి తొల‌గించాలని డిమాండ్ చేశారు. ఎస్సీల‌పై దాడులు అరిక‌ట్టాల్సిన ప్ర‌భుత్వ‌మే ప్రోత్స‌హిస్తుంటే.. ఇంకో డాక్ట‌ర్ సుధాక‌ర్, ఇంకో ఓంప్ర‌తాప్, మ‌రో చీరాల కిర‌ణ్‌కుమార్‌లాగే ద‌ళితులు బ‌ల‌వుతూనే ఉంటారని అన్నారు.