తెలంగాణ నూతన అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ బాధ్యతలను స్వీకరించాలని అక్బరుద్దీన్ కోరారు. ప్రొటెం స్పీకర్ ఆహ్వానం మేరకు స్పీకర్ గా గడ్డం ప్రసాద్ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం గడ్డం ప్రసాద్ ను ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, కేటీఆర్ తదితరులు తోడ్కొని వచ్చి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత సభలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన ఛైర్ వద్దకు వెళ్లి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన శాసనసభ కొనసాగుతోంది.