తెలంగాణను గెలుచుకుందామంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి తాజాగా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ నెల 6న (సోమవారం) నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. కొడంగల్ ఓటర్లు రెడీగా ఉన్నారని, డిసెంబర్ 3న కాంగ్రెస్ విజయం కన్ఫర్మ్ అవుతుందని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈమేరకు కాంగ్రెస్ జెండా చేతిలో పట్టుకుని ఉన్న ఫొటోను రేవంత్ రెడ్డి ఈ ట్వీట్ కు జతచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం పది గంటలకు కొడంగల్ నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.