తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం శనివారం లాంఛనంగా ప్రారంభించింది. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. అనంతరం ఆర్టీసీ బస్సులో మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి ప్రయాణించారు. ‘మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే పథకం ప్రారంభం’ అంటూ కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు బస్సులో ప్రయాణించే సమయంలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. భారీ కాన్వాయ్‌తో బస్సులు ముందుకు కదిలాయి.