టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి కొణిదెల అంజనాదేవి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఇంట్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. చిరు, సురేఖ, ఆయన సోదరి, ఇతర కుటుంబ సభ్యులు అంజనాదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమెతో కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. కనిపించే దేవత, కని పెంచిన అమ్మకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్విటర్ లో ట్వీట్ చేశారు.