మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామిని పరామర్శించారు. కేసీఆర్ ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చినజీయర్ స్వామి ఆసుపత్రికి వెళ్ళి బీఆర్ఎస్ అధినేతను పరామర్శించారు.  నిన్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ నిర్వహించింది. ఆ తర్వాత ఆయనను పలువురు నాయకులు ఆసుపత్రిలో పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి… మాజీ సీఎంను పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని చిన్నజీయర్ స్వామి ఆకాక్షించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులతో చిన్నజీయర్ స్వామి కొంతసేపు మాట్లాడారు.