రూ.9 కోట్ల విలువైన 90.48 కిలోల మెథపెడ్రోన్ స్వాధీనంపీఎస్ఎన్ మెడికేర్ పరిశ్రమ డైరెక్టర్సహా ముగ్గురి అరెస్టుఈనాడు, హైదరాబాద్ శివారులోని ఓ రసాయన పరి శ్రమలో భారీగా మాదకద్రవ్యాలు లభ్యమయ్యాయి. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ), ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా గురు, శుక్రవా రాల్లో నిర్వహించిన ఆపరేషన్లో 90.48 కిలోల 3- మిథైల్మెథ్క్యాధి నోన్ (3-ఎంఎంసీ) లేదా మెథ పెడ్రోన్గా వ్యవహరించే డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.8.99 కోట్లుగా గుర్తించారు. ఇంటర్పోల్ సమాచారం ఆధారంగా సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం ప్రాంతంలోని పీఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో తనిఖీలు చేపట్టగా తెల్లటి పొడి రూపంలో ఉన్న మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీఏ డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు పరిశ్రమ డైరెక్టర్ కస్తూరురెడ్డి నెమళ్లపూడి, ప్రొడక్షన్ మేనేజర్ కె. సుధా కర్రెడ్డి, క్వాలిటీ కంట్రోల్ ఇన్చార్జి జి. వెంకటేశ్వర్లుపై పటాన్చెరు ఎక్సై జెస్టేషన్లో కేసు నమోదు చేసి, ముగ్గురినీ అరెస్టు చేశామన్నారు.యూరప్ దేశాలకు ఎగుమతినగర శివార్లలో మూతపడిన పరిశ్రమల్లో మాదకద్రవ్యాలు తయారు చేస్తూ పట్టుబడ్డ ఘటనలు గతంలో చాలానే వెలుగుచూశాయి. ప్రస్తుత కేసులో మాత్రం నిర్వహణలో ఉన్న రసాయన పరిశ్రమలోనే మెథ పె డ్రోన్ తయారు చేస్తుండటం గమనార్హం. సిద్ధం చేసిన ఈ సరకుకు ‘వైఎల్పీ01’ అనే కోడ్ భాషను పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. దానికి ఎలాంటి తయారీ రికార్డులు గానీ ప్రొడక్షన్ లాగ్స్ గానీ లేనట్లు వెల్ల డైంది. పలు యూరప్ దేశాల నుంచి వీటికి ఆర్డర్లు సంపాదించినట్లు తేలింది. మె ఫెడ్రోన్ అనే మత్తుపదార్థాన్ని ఇది పోలి ఉన్నట్లు గుర్తిం చారు. 2012లో స్వీడన్లో తొలిసారిగా గుర్తించిన మెఫెడ్రోన్పై భారత్ సహా పలు దేశాల్లో నిషేధం ఉంది. ఈ క్రమంలోనే దీనికి ప్రత్యామ్నా యంగా 3-ఎంఎంసీకి యూరప్లో భారీగా డిమాండ్ ఏర్పడటంతో ఇతర దేశాల నుంచి సరఫరా అవుతోంది. పొడి లేదా స్పటిక రూపంలో ఉండే దీన్ని సిగరెట్లు, మాత్రలు, ఇంజెక్షన్ల రూపంలో వినియోగిస్తుంటారు. ఈ డ్రగ్ భారత్ నుంచి ఎక్కువగా ఎగుమతి అవుతున్నట్లు గుర్తించిన ఇంట ర్పోల్ నిఘా విస్తృతం చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో నడు స్తున్న దందా బహిర్గతమైంది.